TRS Party Working President Sri KTR meeting with Ministers & MLAs.

12Jan 2020

TRS Party Working President Sri KTR meeting with Ministers & MLAs.

కార్పొరేషన్ల పరిధిలోని మంత్రులు, ఎమ్మెల్యేలతో సమావేశమైన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్. 10 కార్పొరేషన్లలో విజయం సాధించే దిశగా పనిచేయాలని వారికి దిశానిర్దేశం చేశారు. మరియు మున్సిపల్‌ ఎన్నికలకు ఉమ్మడి జిల్లాల వారీగా 9 మంది సీనియర్‌ నేతలను కోఆర్డినేటర్లు గా నియమించిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్.

వరంగల్‌-బాలమల్లు, కరీంనగర్‌-బొంతు రామ్మోహన్‌, రంగారెడ్డి-ఎమ్మెల్సీ నవీన్‌ కుమార్, మహబూబ్‌నగర్‌-డీకే శివకుమార్‌, ఆదిలాబాద్‌- దండె విఠల్‌, ఖమ్మం-గట్టు రామచంద్రరావు, మెదక్‌-శేరి సుభాష్‌రెడ్డి, నిజామాబాద్‌-మారెడ్డి శ్రీనివాస్‌ రెడ్డి, నల్గొండ-పల్లా రాజేశ్వర్‌రెడ్డి లను ఇన్‌ఛార్జ్‌లుగా నియమించారు

Image may contain: 4 people, people sitting, table and indoor

– కార్పొరేషన్ల ఏర్పాటుతో నగరాల్లో అభివృద్ది వేగం అవుతుంది
– గతంలో వరంగల్, ఖమ్మం, నిజామాబాద్ ప్రత్యేక నిధులు ఇచ్చిన విషయాన్ని ప్రజల్లోకి తీసుకుపోవాలని నిర్ణయం
– కరీంనగర్, నిజామాబాద్ కార్పొరేషన్లలో బిజెపి-కాంగ్రెస్ పార్టీల లోపాయికారీ కుమ్మక్కుని ప్రజల్లోకి తీసుకుపోవాలని సూచన
– కార్పొరేషన్లలో పార్టీ బిఫారాలకు భారీ పోటీ నేపథ్యంలో నామినేషన్ల ఉపసంహరణపైన దృష్టి పెట్టాలని అదేశం
– మంత్రులు శ్రీ మల్లారెడ్డి, శ్రీ కొప్పుల ఈశ్వర్, శ్రీ గంగుల కమాలాకర్, ఎమ్మెల్యేలు శ్రీ గణేష్ బిగాల, శ్రీ కోరుకంటి చందర్ లతో మాట్లాడిన కేటీఆర్
– పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ముఖ్యమంత్రి పొలిటికల్ సెక్రటరీ శ్రీ శేరి సుభాష్ రెడ్డిలతో కార్పొరేషన్లపైన సమీక్ష

Image may contain: 5 people, people sitting, table and indoor

నిన్న మున్సిపాలీటీల్లోని నాయకులు, ఎమ్మెల్యేలతో సమావేశమైన టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ ఈరోజు కార్పోరేషన్లలోని మంత్రులు, నాయకులతో చర్చించారు. రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న 10 కార్పొరేషన్లలో విజయం సాధించాలని ఈ సదర్భంగా వారికి కేటీఆర్ తేల్చిచెప్పారు. ఈ ఎన్నికల్లో కార్పోరేషన్లు చాల కీలకమైనవని, భౌగోళికంగా పెద్దవైన ఈ పురపాలికల్లో పార్టీ విజయం సాధించాల్సిందేనన్నారు. ఇక్కడ విజయం కోసం పూర్తి స్ధాయి ప్రయత్నాలు చేయాలని, ఇందులో ఎలాంటి అలసత్వం ప్రదర్శించవద్దని సూచించారు. మున్సిపాలిటీలతో పోల్చితే, కార్పోరేషన్లతో టీఆర్ఎస్ పార్టీ తరపున పెద్దఎత్తున నామినేషన్ల వేసిన నేపథ్యంలో ఇక్కడ బిఫారాలు దక్కే అభ్యర్ధులు మినహా ఇంకా ఏవరూ పోటీలో లేకుండా చూడాలన్నారు. ఈ సమావేశం సందర్భంగా రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న కరీంనగర్, రామగుండం, నిజామాబాద్, బడంగ్ పేట్, మీర్ పేట్, బండ్లగూడ జాగీర్, బోడుప్పల్, ఫీర్జాదీగూడా, జవహార్ నగర్, నిజాంపేట్ కార్పోరేషన్లలోని క్షేత్రస్థాయి పరిస్ధితులపైన చర్చించారు. స్వయంగా అయా కార్పోరేషన్ల పరిధిలోని మంత్రులు, ఎమ్మెల్యేలతో కేటీఆర్ మాట్లాడారు. ప్రస్తుతం అక్కడ ఉన్న నామినేషన్లు వేసిన అభ్యర్ధుల సంఖ్యతోపాటు నగరాల్లో ప్రచారం జరుగుతున్న తీరుపైన చర్చించారు. పార్టీ పథకాలు, అభివృద్ది కార్యక్రమాలను పెద్ద ఏత్తున ప్రజల్లోకి తీసుకుపోవాలన్నారు. గతంలో వరంగల్, ఖమ్మం, నిజామాబాద్ వంటి కార్పోరేషన్లకు ప్రత్యేకంగా బడ్జెట్ లో నిధులిచ్చి అయా నగరాల అభివృద్ది కృషి చేస్తున్న తీరుని తమ ప్రచారంలో ప్రస్తావించాలని సూచించారు. ఈ దఫా నూతనంగా ఏర్పాటైన కార్పోరేషన్ల అభివృద్దికి కూడా ప్రభుత్వం మద్దతు ఇస్తుందన్న హమీ ఇవ్వాలని కోరారు.

Image may contain: 6 people, people smiling, people sitting, child and indoor

ఈరోజు పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ముఖ్యమంత్రి పొలిటికల్ సెక్రటరీ శ్రీ శేరి సుభాష్ రెడ్డిలతో కార్పోరేషన్లపైన సమీక్ష నిర్వహించారు. రామగుండం స్ధానిక ఎమ్మెల్యే శ్రీ కోరుకంటి చందర్, మంత్రి శ్రీ కొప్పల ఈశ్వర్ తో కేటీఆర్ సమావేశం అయ్యారు. కార్పోరేషన్ ఎన్నికలో విజయం సాధించేందుకు మంత్రి కొప్పుల సహాకారం తీసుకోవాలని ఎమ్మెల్యేకు సూచించారు. స్ధానికంగా ఉన్న నాయకులతోపాటు రామగుండం నగరంలోని నాయకులతో మంత్రి కొప్పుల ఈశ్వర్ గారికి ఉన్న సంబంధాలు ఈ ఎన్నికలల్లో విజయానికి ఉపయుక్తంగా ఉంటాయన్నారు. హైదరాబాద్ శివారులోని కార్పోరేషన్లపైన పార్టీ ప్రత్యేకంగా దృష్టి పెట్టినందున వాటిలో విజయం పార్టీకి చాల కీలకమని మంత్రి మల్లారెడ్డికి తెలిపారు. ఈ మేరకు వాటిలో ఉన్న పార్టీ స్థితిగతులు, కార్యాచరణపైన చర్చించారు. శివార్లలో పురపాలికలను ఏర్పాటు చేయకముందు ప్రజలకు ఎదురైన ఇబ్బందులను ప్రజల దృష్టికి తీసుకుపోవాలని కోరారు. కార్పోరేషన్ల ఏర్పాటు ద్వార వచ్చే మౌళిక వసతులు, అభివృద్ది కార్యక్రమాల ద్వారా కలిగే ప్రయోజనాలను సైతం తెలియజేయాలన్నారు. కరీంనగర్, నిజామాబాద్ కార్పోరేషన్ల ఎన్నికలపైన కూడా ఈ సందర్భంగా కేటీఆర్ చర్చించారు. ఈ రెండు కార్పోరేషన్లతో బిజెపి, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కయి, లోపాయికారీగా కలిసి పనిచేస్తున్న తీరును ప్రజల ముందుపెట్టాలన్నారు. ఈరెండు పార్టీలు టీఆర్ఎస్ పార్టీని సొంతగా ఎదుర్కోలేకపోతున్నాయని, ఇదే టీఆర్ఎస్ పార్టీకున్న బలాన్ని సూచిస్తుందన్న కేటీఆర్, ఎన్నికల ప్రచారంలో ఈ రెండు పార్టీల అనైతిక తీరుని ఎత్తి చూపాలన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే శ్రీ గణేష్ బిగాలతో మాట్లాడారు.

Image may contain: 5 people, people smiling, people sitting, child and indoor