19Jan 2019
గజ్వేల్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకులు వంటేరు ప్రతాప్ రెడ్డి తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ప్రతాప్ రెడ్డితో పాటు గజ్వేల్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డితో పాటు ఉమ్మడి మెదక్ జిల్లా టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.