సిరిసిల్ల నియోజకవర్గ విజయోత్సవ ర్యాలీ లో పాల్గొన్న టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సిరిసిల్ల నియోజకవర్గాన్ని అగ్రగామిగా తీర్చిదిద్దుతానని అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ముందుకెళ్తున్నాయి. కులమతాలకు అతీతంగా కేసీఆర్ నాయకత్వాన్ని గౌరవించి, గుర్తించి దేశం అబ్బురపడే విధంగా 88 స్థానాలను కట్టబెట్టారు.కేసీఆర్‌ను గెలిపించిన తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు. సిరిసిల్ల వేదికగానే నాకు రాజకీయ గుర్తింపు వచ్చింది. నియోజకవర్గంలో చారాణా అభివృద్ధి జరిగింది.. ఇంకా జరగాల్సింది బారణా ఉంది. అది కూడా చేసి చూపిస్తాను అని కేటీఆర్ తెలిపారు.